ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్? క్లాడ్ చెప్పిన సమాధానం ఇదే!
- ఏఐ కాలంలో చదువులపై పెద్ద చర్చ
- చాట్‌బాట్ క్లాడ్ ఆసక్తికరమైన సూచనలు
- గణితం నేర్చుకుంటే ఎన్నో అవకాశాలు
- బయోటెక్నాలజీ రంగానికి తిరుగులేని భవిష్యత్తు
- పవర్ ఇంజనీరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాలంలో కాలేజీలో ఏం కోర్సు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతను, తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న ఇది. సాంకేతికత ఇంత వేగంగా మారుతున్న తరుణంలో ఏ కోర్సు ఎంచుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రత్యక్షమైన ఓ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ప్రముఖ ఏఐ చాట్‌బాట్ ‘క్లాడ్’ను ఓ నెటిజన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, రాబోయే 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు 18 ఏళ్ల యువకుడు కాలేజీలో చేరడానికి టాప్ రెండు కోర్సులు సూచించు’’ అని కోరారు. దీనికి ఆ చాట్‌బాట్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచింపజేస్తోంది.
రాబోయే 50 ఏళ్లలో ఏ రంగం కూడా ఒకేలా ఉండదని, గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పులు చాలా వేగంగా వస్తాయని క్లాడ్ స్పష్టం చేసింది. కాబట్టి కేవలం పుస్తకాల్లోని నాలెడ్జ్ కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారే నైపుణ్యాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇచ్చే చదువులే ముఖ్యం అంటూ రెండు కోర్సులను సిఫార్సు చేసింది.
అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
ఏఐ ఎంతగా అభివృద్ధి చెందినా.. కంప్యూటర్లు ఇచ్చే లెక్కలను, అంచనాలను సరిచూడడానికి మనుషుల అవసరం కచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో కోడింగ్ రాయడం సులభం కావచ్చు. కానీ, ఆ మోడల్స్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయో లేదో తేల్చాల్సింది మనుషులే. మ్యాథ్స్ అనేది అన్ని రంగాలకూ పనికొచ్చే ‘యూనివర్సల్ డిగ్రీ’ లాంటిదని క్లాడ్ పేర్కొంది. ఇది చదివితే మెషీన్ లెర్నింగ్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, పబ్లిక్ పాలసీ వంటి ఎన్నో రంగాల్లో రాణించవచ్చు.
బయోలాజికల్ అండ్ బయోఇంజనీరింగ్ సైన్సెస్
ఏఐ ల్యాబ్‌లో కొత్త మందుల ఫార్ములాలను కనిపెట్టవచ్చు. కానీ, వాటిని నిజ జీవితంలో ప్రయోగించి చూడటానికి క్లినికల్ ట్రయల్స్, ల్యాబ్ ప్రయోగాలు కావాలి. కంప్యూటర్ల స్క్రీన్లకు పరిమితం కాని భౌతిక ప్రపంచం ఇది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్‌కేర్, దీర్ఘాయుష్షు పరిశోధనలకు రాబోయే రోజుల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుందని క్లాడ్ వివరించింది.
ఈ రెండింటితో పాటు ‘ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్’ రంగానికి కూడా భారీగా అవకాశాలు ఉంటాయని చాట్‌బాట్ చెప్పింది. ఏఐ డేటా సెంటర్లు నడవాలన్నా, ప్రపంచం క్లీన్ ఎనర్జీ వైపు మారాలన్నా పవర్ సిస్టమ్స్ నిర్మించే ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంటుంది.
చివరగా ఆ ఏఐ టూల్ ఒక మంచి మాట చెప్పింది. 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లు ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుక, ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా.. ఏ మార్పునైనా తట్టుకుని నిలబడేలా చేసే చదువులను ఎంచుకోవడమే ఉత్తమం అని సూచించింది.